తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

61చూసినవారు
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ములుగు, మేడ్చల్, జనగామ జిల్లాల్లో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్