ఎంపీ పప్పూ యాదవ్‌కు బెయిల్

71చూసినవారు
ఎంపీ పప్పూ యాదవ్‌కు బెయిల్
బీహార్‌లోని పూర్నియా నుంచి గెలిచిన స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్‌కు ఊరట లభించింది. పూర్నియా కోర్టు ఆయనకు గురువారం బెయిల్ మంజూరు చేసింది. తన నుంచి ఎంపీ రూ.కోటి డిమాండ్ చేశారని స్థానిక వ్యాపారవేత్త ఆరోపించారు. దీనిపై జూన్ 10న మొఫుసిల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిని ఎంపీ పప్పూ యాదవ్ ఖండించారు. 'ఇదంతా నాపై జరుగుతున్న కుట్రలో భాగమే. నేను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను' అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్