బైకర్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన టిప్పర్(VIDEO)

60చూసినవారు
TG: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొల్లూరు వద్ద ఉస్మాన్ నగర్ రాజ్ పుష్ప సర్కిల్‌లో వేగంగా వచ్చిన ఓ టిప్పర్ లారీ బైకర్ ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.

సంబంధిత పోస్ట్