అలా చేయమంటే భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సాప్

55చూసినవారు
అలా చేయమంటే భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సాప్
ఢిల్లీ హైకోర్టులో ఐటీ నిబంధనలపై విచారణ సందర్భంగా వాట్సాప్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటంతోనే యూజర్లు తమ సమాచారం సేఫ్‌గా ఉందనే ధీమాతో వాట్సాప్ వాడుతున్నారు. ఒకవేళ మమ్మల్ని కేంద్రం ఈ ఎన్‌క్రిప్షన్ తొలగించమంటే ఇండియాలో మా సేవలను రద్దు చేసుకుంటాం. 2021లో తెచ్చిన ఈ కొత్త రూల్స్ ప్రకారం లక్షల మెసేజ్‌లను ఏళ్ల తరబడి స్టోర్ చేయాలి. ఈ రూల్ ప్రపంచంలో ఎక్కడా లేదు’ అని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్