నేడు హనుమాన్ జయంతి

55చూసినవారు
నేడు హనుమాన్ జయంతి
ఎక్కడెక్కడ రామనామము వినబడుతుందో అక్కడక్కడ ఆంజనేయ స్వామి ఉంటారని భక్తుల నమ్మకం. రామ భక్త పరాయణుడు, బహుపరాక్రమశాలి, ఘోటక బ్రహ్మచారి శ్రీ ఆంజనేయుడి జన్మదినాన్ని “హనుమాన్ జయంతి”గా ఉత్సవాలు చేసుకొంటారు. భారతీయ హిందువులే కాకుండా నేపాల్ లాంటి విదేశాల్లో కూడా విరివిగా జరుపుకుంటారు. హనుమాన్ జయంతి ఏడాదికి రెండు సార్లు జరుపుకుంటారు. హనుమాన్ జయంతిని కొందరు చైత్ర మాసం పౌర్ణమి నాడు చేస్తుండగా మరికొందరు వైశాఖ దశమి నాడు జరుపుకోవటం గమనార్హం.

సంబంధిత పోస్ట్