విషాదం: బావి కూలి నలుగురి మృతి

81చూసినవారు
విషాదం: బావి కూలి నలుగురి మృతి
జార్ఖండ్‌లోని లోహర్‌దగా జిల్లాలో విషాదం జరిగింది. సేన్హా పీఎస్ పరిధిలోని చిత్రి అంబటోలి గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ ప్రాజెక్టు కింద కూలీలు బావి తవ్వుతుండగా.. ఒక్కసారిగా పైనున్న మట్టి వారిపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళతో సహా కనీసం నలుగురు కూలీలు సజీవ సమాధి అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్