క్రెడిట్ కార్డు కావాలా? లోన్లు కావాలా? ఫ్లాట్ కావాలా? అంటూ పదే పదే ఇబ్బందులు పెడుతుంటూ చాలా మందికి ప్రతి రోజు వందల్లో కాల్స్ వస్తుంటాయి. ఇలాంటి మోసపూరిత కాల్స్, సందేశాలు పంపే టెలిమార్కెటర్లపై, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మరిన్ని కఠిన చర్యలకు దిగింది. వినియోగదారులను మోసపూరిత కాల్స్ నుంచి రక్షించేందుకు, మెసేజింగ్ సేవలు దుర్వినియోగం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని టెలికాం సంస్థలను ట్రాయ్ ఆదేశించింది.