కొడుకు మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

57చూసినవారు
కొడుకు మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
AP: అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొడుకు మృతి తట్టుకోలేక తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. తాడిపత్రి పట్టణం శ్రీనివాసపురానికి చెందిన శైలజ(47), సురేంద్రబాబు దంపతుల కుమారుడు శ్రీచరణ్. ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో అతడు మూడు రోజుల కిందట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో శైలజ మనో వేదనకు గురై ఉదయం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్