ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చర్మ రక్షణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. దీంతోపాటు యాంటీ టానింగ్ క్రీమ్స్ వాడాలి. తద్వారా చర్మం ట్యాన్ అవ్వకుండా మెరుస్తూ ఉంటుంది. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయేలా ఇంట్లో తయారు చేసుకున్న నలుగు పిండితో స్నానం చేయడం మంచింది.