ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరో నితిన్ (వీడియో)

71చూసినవారు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను హీరో నితిన్ దర్శించుకున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్‌తో కలిసి దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. తన సినిమా ‘రాబిన్ హుడ్’ మార్చి 28 విడుదల కానుండడంతో హిట్ కావాలని ప్రత్యేక పూజలు జరిపించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్