పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ విభాగం, రెవెన్యూ, ఫుడ్ సేప్టీ విభాగాల అధికారులు బృందాలుగా ఏర్పడి డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ నేతృత్వంలో తమ పరిధిలోని మాల్స్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మియాపూర్, కూకట్‌పల్లి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో అనుమతి తీసుకున్న దాని కంటే ఎక్కువ స్ర్కీన్‌లు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ఫుడ్ కోర్టుల్లోనూ నాణ్యమైన ఆహారం లేదని గుర్తించారు.