నేడు రాంచీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన

85చూసినవారు
నేడు రాంచీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీకి చేరుకోనున్నారు. రాంచీలో పార్టీ రాష్ట్ర విస్తరణ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ కార్యకర్తలకు జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ విజయానికి కావాల్సిన అంశాలను తెలియజేయనున్నారు. రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయికి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్