విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు యుద్ధ విమానాన్ని నడిపారు. హెచ్ఏఎల్ స్వదేశంలో తయారు చేసిన హెచ్ జేటీ-36 'యశస్' జెట్ విమానాన్ని ఆయన నడిపారు. బెంగళూరులోని యలహంకలో ద్వైవార్షిక ఏరో ఇండియా సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి యుద్ధ విమానాన్ని నడిపి ఆనందం వ్యక్తం చేశారు.