తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 418 ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. దీంతో యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మామిడి తోటల్లో పెద్ద ఎత్తున కాయలు నేలరాలాయి. ఆకు కూరల తోటలకూ నష్టం వాటిల్లింది. వరి కల్లాల్లో నీరు చేరి నష్టం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి, సిరికొండ, డిచ్పల్లి మండలాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ములుగు, వికారాబాద్, తదితర జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి.