సాధారణంగా మనుషుల బ్లాడర్ 400 మి.లీ నుంచి 600 మి.లీ మూత్రాన్ని ఉంచుకోగలదు. ఆ పరిమితి దాటిన క్షణం నుంచే బ్లాడర్ మీద ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. యూరిన్‌కు వెళ్లకుండా ఎక్కువసేపు ఆపుకుంటే.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యూటీఐ-UTI) వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడి, దగ్గినా, తుమ్మినా, నవ్వినా దుస్తుల్లోనే మూత్రం పడే అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కొన్నిసార్లు బ్లాడర్ కూడా పగిలిపోవవచ్చు.