యూజర్లు ఇకపై ఒక పోస్ట్ లో 20 ఫోటోలు & వీడియోలను యాడ్ చేసుకోవచ్చు: ఇన్‌స్టాగ్రామ్

70చూసినవారు
యూజర్లు ఇకపై ఒక పోస్ట్ లో 20 ఫోటోలు & వీడియోలను యాడ్ చేసుకోవచ్చు: ఇన్‌స్టాగ్రామ్
ఇన్‌స్టాగ్రామ్ సంస్థ తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఇన్‌స్టాలో యూజర్లు ఒక్క పోస్ట్ లో ఏకంగా గరిష్ఠంగా 20 ఫోటోలు లేదా వీడియోలను యాడ్ చేసుకునేందుకు వీలుగా ఇన్‌స్టాగ్రామ్ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. 2017లో తీసుకొచ్చిన క్యారోసెల్ ఫీచర్ ద్వారా ఇప్పటి వరకు యూజర్లు ఒక పోస్ట్ లో కేవలం 10 ఫోటోలు లేదా వీడియోలను పోస్ట్ చేయడానికే మాత్రమే అవకాశం ఉంది. మరోవైపు, Instagram యొక్క ప్రత్యర్థి ప్లాట్‌ఫారమ్ TikTok అదే ఫీచర్ ద్వారా ఒకే పోస్ట్‌లో గరిష్టంగా 35 ఫోటోలు యాడ్ చేసుకోవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్