కేరళలోని కోజికోడ్ సమీపంలోని చెరువన్నూర్‌లో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. ఫాతిమా రీనా అనే అమ్మాయి స్కూలుకు వెళ్లే క్రమంలో జీబ్రా క్రాసింగ్‌పై రోడ్డు దాటింది. ఆ సమయంలో ఓ ప్రైవేట్ బస్సు వేగంగా దూసుకొచ్చింది. రెప్పపాటులో ఆ అమ్మాయిని బస్సు ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఫాతిమాకు ప్రాణాపాయం తప్పింది. ఆమెకు చిన్నపాటి గాయాలయ్యాయి. ఇక ఆ బస్సు డ్రైవర్ లైసెన్స్‌ను రద్దు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.