రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. 200 మంది పోలీసుల భద్రత మధ్య దళిత వరుడు గుర్రంపై ఊరేగాడు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి బారత్‌గా దళిత వధువు గ్రామానికి చేరుకున్నాడు. దళిత వరుడు గుర్రంపై ఊరేగడాన్ని ఆ గ్రామంలోని ఉన్నత కులాల వారు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన వధువు తండ్రి పోలీసుల సహాయం కోరడంతో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.