VIDEO: అత్త ఇంటి ముందు కోడలు ధర్నా

30855చూసినవారు
మేడ్చల్ జిల్లాలో తనకు న్యాయం చేయాలంటూ అత్త ఇంటి ముందు కోడలు ధర్నా చేపట్టిన ఘటన జరిగింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం కాలనీలో కళ్యాణి(30) భర్త 4 నెలల క్రితం చనిపోవడంతో.. అత్త తనను చిత్ర హింసలకు గురిచేసి, తనకు సంబందించిన బంగారం పుస్తెల తాడు, ఇంటి పత్రాలు తను ఇంట్లో లేని సమయంలో కాజేశారని కళ్యాణి వాపోయింది. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని కళ్యాణి, కుటుంబ సభ్యులు అత్త ఇంటి ముందు ధర్నాకు దిగారు.

సంబంధిత పోస్ట్