TG: మెదక్ జిల్లా, రామాయంపేట కస్తూర్బా గాంధీ విద్యాలయం భవనంపై నుంచి బాలిక కిందపడి గాయపడింది. ఎడమ కాలు, చెయ్యి విరగడంతో పాటు తలకు తీవ్ర గాయమై బాలిక గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తోటి విద్యార్థులు తోయడం వల్లనే కిందపడిందని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులు లేకపోవడంతో విద్యార్థిని ఆలనా పాలనా చూస్తున్న నానమ్మ. తన మనవరాలికి మంచి వైద్యం అందించాలని బాలిక నానమ్మ ప్రభుత్వాన్ని కోరింది.