దుండగుడి చేతిలో గాయపడిన నటుడు సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆరు రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన సెక్యూరిటీ బాధ్యతలను నటుడు రోనిత్ రాయ్ తీసుకున్నారు. ముంబై వేదికగా సెక్యూరిటీ ఏజెన్సీ రోనిత్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 16న సైఫ్‌పై దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే.