ఊహించని విధంగా తెరపైకి విజయశాంతి పేరు

79చూసినవారు
ఊహించని విధంగా తెరపైకి విజయశాంతి పేరు
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఆదివారం సాయంత్రం ఏఐసీసీ ఖరారు చేసింది. ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక మహిళకు అవకాశం ఇస్తూ.. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ప్రకటించింది. ముఖ్యంగా రాములమ్మ పేరును ఖరారు చేయడం ఆసక్తికరంగా మారింది. విజయశాంతి పేరు పరిగణనలో ఉన్నట్టు ఇప్పటివరకు వార్తలు రాలేదు. దీంతో, ఊహించని పేరు తెర పైకి రావడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్