చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోడంగల్ మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ అన్నారు. శుక్రవారం కొడంగల్ పట్టణంలోని పలు కాలనీలలో తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం వర్షాకాలం ఉండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రపరచాలన్నారు.