వికారాబాద్ జిల్లా తాండూరులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 100 అడుగుల ఎత్తు, 30 మీటర్ల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పంద్రాగస్టును పు
రస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ, కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.