వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఎంపీడీవో వెంకన్న గౌడ్, పంచాయతీ కార్యదర్శి బసంత్ రెడ్డి ఇంటింటికీ వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు గురువారం సర్వే నిర్వహించారు. ముందుగా ఇళ్లు లేని వారికి స్థలం ఉన్న వారిని ఎంపిక చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు వెంకటయ్య, నర్సింలు, రాములు, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.