వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం రేగడిమైలారం, ఎన్కేపల్లి, దుద్యాల మండల కేంద్రంలో త్వరలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు సెర్ఫ్ ఎస్పిఎం ఉమాపతి గురువారం తెలిపారు. రేగడిమైలారం రైతు వేదిక భవనాన్ని, దుద్యాల మండల కేంద్రంలో కందులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విన్నూత్ రెడ్డి, డీపీఎం శేఖర్, ఏపీఎం సత్యం, సీసీ యాదయ్య, వీవోఏలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.