విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కొడంగల్ తహశీల్దార్ బీ. విజయ్ కుమార్ సూచించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని ఎస్టీ బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల అందించే భోజనం, వంట గది, బియ్యం, కూరగాయలను పరిశీలించారు. భోజనం నాణ్యతలో నిర్లక్ష్యం వహించొద్దు అన్నారు. భోజనం గురించి విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు.