చేతులు లేకపోయినా గ్రూప్-3 పరీక్షకు హాజరు
తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం గ్రూప్-3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం చారిగాం గ్రామానికి చెందిన జాకీర్ భాష జవహర్ నవోదయ విద్యాలయంలో గ్రూప్-3 పరీక్షకు హాజరయ్యాడు. భాష.. పుట్టుకతో రెండు చేతులు లేకుండా జన్మించాడు. అయినా అతను ఉన్నత చదువులు చదివాడు. తాజాగా గ్రూప్-3 పరీక్ష రాసిన అతను ఉద్యోగం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. చదువుకు అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించాడు.