దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర: రాష్ట్రస్థాయి వూషూ పోటీలకు కొత్తకోట విద్యార్థి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 29న నిర్వహించిన ఉమ్మడి జిల్లా అండర్-14, 17, 19 (ఎస్జిఎఫ్ఐ) వూషూ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటలోని ఓ కరాటే అకాడమీకి చెందిన విద్యార్థి డి. యువరాజ్ ఉత్తమ ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. నవంబర్ 2న మహబూబాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు బుధవారం మాస్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.