భూపాలపల్లి కాటారం మండల కేంద్రంలో గురువారం మీనాక్షి కాటన్ ఇండస్ట్రీస్ లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని పత్తి దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, సిబ్బంది గమనించి మంటలను అదుపు చేశారు. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పేశారు. సుమారుగా రెండువేల క్వింటాళ్ల వరకు పత్తి దద్దమైనట్లు నిర్వాహకులు తెలిపారు.