బారీ వర్షాలకు నిలిచి పోయిన బొగ్గు ఉత్పత్తి

66చూసినవారు
బారీ వర్షాలకు నిలిచి పోయిన బొగ్గు ఉత్పత్తి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మండల కేంద్రమైన తాడిచెర్లలోని టీఎస్ జెన్కో బ్లాక్ 1 ఓసిపిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓసిపిలోకి బారిగ వరద నీరు చేరడంతో పాటు అంతర్గత రోడ్లు బురద మయంగా మారడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి అని పనులు నిర్వహిస్తున్న ఏఎమ్మార్ ఓసిపి అధికారులు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్