భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విలక్షణ పార్లమెంటేరియన్ గా మన్మోహన్ సింగ్ సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోరు సుదర్శన్, వైనాల ప్రభాకర్, పల్లెబోయిన తిరుపతి, జూపాక అశోక్, కరట్లపెళ్లి రాజేందర్ తదితరులున్నారు.