మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

492చూసినవారు
మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
బీజేపీ కార్యకర్తలు ఏషబోయిన పురుషోత్తం, ఆలకుంట అనిల్ ల పై సీఐ ముస్కే శ్రీనివాస్ చేసిన దాడి పై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. ఆయన మాట్లాడుతూ. చట్ట వ్యతిరేకంగా కేవలం పోలీస్ యూనిఫాం ను అడ్డుపెట్టుకొని అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు మా పార్టీ కార్యకర్తల పై చేసిన దాడికి సీఐ శ్రీనివాస్ శిక్ష అనుభవించక తప్పదు అన్నారు.

సంబంధిత పోస్ట్