జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాయిబాబా మందిరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. షిర్డీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పూలతో బాబాను ముస్తాబు చేశారు.