చిట్యాల మండలం రాంనగర్ కాలనీకి చెందిన ఆరెపెల్లి ఎల్లయ్య ఇంటి ముందు క్షుద్ర పూజల కలకలం రేపింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం. గృహిణి సోమవారం తెల్లవారుజామున వాకిలిని శుభ్రం చేద్దామని బయటికి రాగా, దర్వాజ దగ్గర ముగ్గు వేసి, దాని మీద నిమ్మకాయలు పెట్టి, రక్తాన్ని పోసి ఉంచారని తెలిపారు. దీంతో ఎవరో క్షుద్ర పూజలు చేసి ఉంటారని కుటుంబ సభ్యులు, కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.