మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం ఉన్నత పాఠశాలకు స్థానికులు మహిపాల్ రెడ్డి దాదాపు ఇరవై వేల రూపాయలు విలువ చేసే సైన్స్ పరికరాలు అందజేశారు. ఉన్నత పాఠశాల అయినప్పటికీ, సరైన భవనం లేక రేకుల షెడ్ లలో పాఠశాలను నిర్వహిస్తున్నారు.
ఉపాధ్యాయుల నిబద్దతను మెచ్చి, పాఠశాల వసతుల లేమిని గమనించి గ్రామస్తులైన మహిపాల్ రెడ్డి మైక్రో స్కోప్ తో సహా జీవ శాస్త్ర, భౌతిక రసాయన శాస్త్ర సంబంధం పరికరాలు డొనేట్ చేశారు.