మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సోమవారం రైతులు ఆందోళన చేపట్టారు. తమకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదంటూ రైతుల ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే మండలం లోని కౌసల్యదేవిపెళ్లి లోగ్రామపంచాయతీ ముందు పంట నష్టపరిహారం అసలైన రైతులకు, కాకుండ అనర్హవులకు ఇచ్చారంటూ రైతుల నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదని వాపోయారు.