న్యూసెన్స్ చేసేవారికి డోర్నకల్ పోలీసులు హెచ్చరికలు చేశారు. సీఐ రాజేష్ మాట్లాడుతూ.. డిసెంబర్ 31న రాత్రి ఎవరైనా రోడ్లపై అనవసరంగా సంచరిస్తూ ఇతరులకు అసౌకర్యం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వారిపై న్యూసెన్స్ కేసు బుక్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు సోమవారం తెలిపారు. ప్రజలందరు ఈ విషయాన్ని గమనించి నూతన సంవత్సర వేడుకలను ఇంట్లోనే జరుపుకోవాలని, ప్రజలందరికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.