బోరింగ్ కి మరమ్మత్తులు చేయించిన మాజీ సర్పంచ్

66చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో బోరింగ్ పాడై పోయింది. ఈ ఎండాకాలంలో గ్రామ ప్రజలు నీళ్ళు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం మాజీ సర్పంచ్ రాంప్రసాద్ స్పందించి అధికారులకి సమాచారం అందించి బోరింగ్ కి మరమ్మత్తులు చేయించారు. ఈ సమస్యని సరి చేయించినందుకు గ్రామ ప్రజలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కారోబార్ శ్యామ్, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్