ముల్కలపల్లిలో ఘనంగా ముత్యాలమ్మ తల్లి పండుగ

68చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో ముత్యాలమ్మ తల్లి పండుగను గురువారం గ్రామ భక్తులు ఘనంగా నిర్వహించారు. ఇంటి వద్ద నుండి బోనాలు తీసుకొచ్చి, ఆ తల్లికి బోనాలు సమర్పించారు. కొబ్బరికాయలు కొట్టారు. తమ కోరికలు కోరుకున్నారు. కోళ్ళను కోశారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆడపడుచులు, యువత, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్