గ్రామాలలో ఘనంగా ఉగాది వేడుకలు

600చూసినవారు
డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ, వెన్నారం, తోడేళ్ళగూడెం, ముల్కలపల్లి, రావిగూడెం, పెరుమాండ్ల సంకీస, చిలుకోడు, గొల్లచెర్ల తదితర గ్రామాలలో మంగళవారం ఉగాది పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగ సందర్బంగా గ్రామ ప్రజలు ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టి, ప్రతీ ఇంటిలో మామిడి పచ్చడి చేసుకొని ఆరగించారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రతీ గల్లీ మామిడి తోరణాలతో కలకల లాడుతూ పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్