ఖమ్మం వరద బాధితులకు తెలంగాణ కళాకారులు విరాళాల సేకరణ
హన్మకొండ చౌరస్తాలో బుధవారం 33 జిల్లాల తెలంగాణ నిరుద్యోగ కళాకారులు తమ ఆటపాటలతో సర్వం కోల్పోయిన ఖమ్మం వరద బాధితులకు సహాయం చేయడానికి గత మూడు రోజుల నుండి విరాళాలు సేకరిస్తున్నారు. తెలంగాణ కళాకారుల అధ్యక్షుడు గడ్డం సుధాకర్, పాలిట రాజు, వెన్నమల్ల వెంకటేష్, కవిత, నామిండ్ల భాస్కర్, సురేందర్, లింగన్న, కృష్ణ, రోజా, శ్రావణి, మంజుల, నర్మద, తదితర కళాకారులు పాల్గొన్నారు.