అయినాపూర్: సబ్ స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టాలని సీపీఎం ధర్నా

84చూసినవారు
కొమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామంలోని నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టాలని గురువారం విద్యుత్ శాఖ ఏఈకి సీపీఎం నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయినాపూర్ గ్రామ ప్రజలు సరిగా విద్యుత్ లేక ఇళ్లు, వ్యవసాయ బావుల వద్ద చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. వెంటనే సబ్ స్టేషన్ పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్