చేర్యాల: అమిత్ షా మాటలు ఖండిస్తూ... దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్

81చూసినవారు
చేర్యాల: అమిత్ షా మాటలు ఖండిస్తూ... దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్
చేర్యాల పట్టణం గాంధీ చౌరస్తాలో గురువారం అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. చేర్యాల మండల పార్టీ అధ్యక్షుడు కొమ్ము రవి మాట్లాడుతూ పార్లమెంటులో జరిగిన చర్చలో భాగంగా అమిత్ షా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం సమర్ధించుకుంటుంది. అమిత్ షాని తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుండి ఉపసంహరించాలి, లేదంటే ఈ నిరసనను మరింత ఉధృతం చేస్తాం అంటూ అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

సంబంధిత పోస్ట్