వందేళ్ల సుదీర్ఘమైన పోరాట చరిత్ర కలిగిన ఏకైక పార్టీ సీపీఐ మాత్రమేనని CPI జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. చేర్యాల మండల కేంద్రంలో సీపీఐ ఆవిర్భావ ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈరి భూమయ్య, కత్తుల భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.