ఆర్ నారాయణమూర్తిని పరామర్శించిన మాజీ మంత్రి

80చూసినవారు
సినీ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి, జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. శుక్రవారం నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య, యోగక్షేమాలను వైద్యులను అడిగి తెలుసుకుని వారిని పరామర్శించి, మెరుగైన చికిత్స అందించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వైద్యులను కోరారు.

సంబంధిత పోస్ట్