ఈనెల 19, 20 తేదీలలో ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలో అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో 24 గంటలు ఏకధాటిగా జరిగే సాహిత్య కళాజాతరకు పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన శ్రీ పోతన సాహిత్య కళావేదిక అధ్యక్షుడు మాన్యపు భుజేoదర్ కు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా భుజేందర్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి సాహిత్య కళాజాతరకు ఆహ్వానం అందినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.