జనగామ జిల్లాలో గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయడంతో ఆది వారం ఉదయం నుండి పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. జిల్లాలో గ్రూప్ 2 పరీక్షకు 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 5471 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష సమయానికి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులకు అందుబాటులో సరిపడా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.