జనగామ జిల్లా గతంలో జనగామ జిల్లా కలెక్టర్ గా, ప్రస్తుత సెక్రటేరియట్ లో ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న శివ లింగయ్యతో పాటు 12 మంది పై స్టేషన్ ఘనపూర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన వీవోఏ సునీత మహోదయ గ్రామైక్య సంఘానికి సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణల నేపథ్యంలో 2021లో సునీతను సస్పెండ్ చేసిన అప్పటి కలెక్టర్ శివలింగయ్య, సునీతను ఆకారణంగా విధుల నుంచి తొలగించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై కేసు నమోదు చేయాలని జనగామ జిల్లా కోర్టు తీర్పు చెప్పింది.