జనగామ జిల్లా వ్యాప్తంగా సోమవారం రెండో రోజు గ్రూప్-2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు జరిగిన తప్పిదాలు ఎదురు కాకుండా క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. స్థానిక పరీక్ష కేంద్రాల వద్ద ఎస్ఐల ఆధ్వర్యంలో పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.